ముంబై వాంఖడే స్టేడియంలో ఈ నెల 4న జరగనున్న భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే, సూపర్-8 దశలో మెరుగైన స్థానం సాధించిన ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది. గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌తో పోలిస్తే, గ్రూప్-1లో భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్‌కు చేరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నాకౌట్ దశలో ఫలితం రాకపోతే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్టు అర్హత సాధిస్తుంది. దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa