పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని ZP హై స్కూల్ 2లో నూతన అదనపు తరగతి గదుల నిర్మాణానికి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, హై స్కూల్లో నూతన అదనపు తరగతి గదుల నిర్మాణానికి దాత కొల్లూరు వీర రాఘవయ్య గారు రూ.63 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa