విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ భర్తకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. తన నెల జీతం చాలా తక్కువని, భరణం చెల్లించలేనంటూ అతడు చేసిన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుత కాలంలో అంత తక్కువ సంపాదనతో జీవించడం అసాధ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ. 12,000 భరణంగా చెల్లించాలని దిగువ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన నెల జీతం కేవలం రూ. 9,000 మాత్రమేనని, అంటే రోజుకు సుమారు రూ. 325 సంపాదిస్తున్నానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇంత తక్కువ ఆదాయంతో అంత భరణం ఎలా చెల్లించగలనని ప్రశ్నించాడు.ఈ వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఒక వ్యక్తి రోజుకు కేవలం రూ. 325 మాత్రమే సంపాదిస్తున్నాడంటే అది నమ్మశక్యంగా లేదు. ఇది అసాధ్యం" అని స్పష్టం చేసింది. భరణం చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి కుంటి సాకులు చెబుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కనీస వేతనం కంటే ఎక్కువే సంపాదించగలడని, భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తకు ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ వ్యాఖ్యలతో భరణం మొత్తాన్ని తగ్గించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa