విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పద్మనాభం మండలం ఇసకలపాలెం గ్రామంలో నిన్న విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. పశువుల కోసం షెడ్డు నిర్మిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.గ్రామానికి చెందిన కల్ల సూరీడు (65), ఆయన కుమారుడు సూరిబాబు (44) తమ పశువుల కోసం షెడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పని కోసం తాపీ మేస్త్రి కంటుబోతు శ్రీను (41) సహాయం తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం, నిర్మాణంలో భాగంగా ఒక ఇనుప స్తంభాన్ని నిలబెడుతుండగా, అది ప్రమాదవశాత్తు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ముగ్గురూ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సూరీడు, తాపీ మేస్త్రి శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూరిబాబుకు తీవ్ర గాయాలు కావడంతో, స్థానికులు అతడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పద్మనాభం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa