ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించని అభిషేక్ శర్మకు భారత క్రికెటర్ సంజు శాంసన్ మద్దతుగా నిలిచాడు. క్రికెట్‌లో ఫామ్ కోల్పోవడం సహజమని, తనదైన రోజున అభిషేక్ తప్పక విజృంభిస్తాడని, అది వరల్డ్ కప్ ఫైనల్స్‌లో కూడా కావచ్చని శాంసన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అభిషేక్‌పై తమకు విపరీతమైన నమ్మకం ఉందని, ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమని, ఒకటి రెండు మంచి షాట్లు కొడితే అంతా కుదురుకుంటుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో తన వైఫల్యం గురించి మాట్లాడుతూ, అది ఛాలెంజింగ్‌గా అనిపించిందని, టీ20 క్రికెట్ విచిత్రమైనదని సంజు శాంసన్ అభిప్రాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa