ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ప్రారంభానికి ముందే Delhi Capitals జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గత సీజన్లో ఢిల్లీ మెంటర్‌గా పని చేసిన Kevin Pietersen తన పదవికి రాజీనామా చేస్తూ జట్టుకు గుడ్‌బై చెప్పేశాడు.తాను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కొనసాగబోనని శనివారం ప్రకటించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఫ్రాంచైజీ ఆశించినట్టుగా పూర్తి సమయం కేటాయించడం తనకు సాధ్యం కాకపోవచ్చని చెప్పాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.ఐపీఎల్ షెడ్యూల్ విడుదలతో కొత్త సీజన్‌కు సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈసారి బలమైన ప్రణాళికలతో టైటిల్ కోసం పోరాడాలని భావించిన జట్టుకు పీటర్సన్ వైదొలగడం అనూహ్యంగా మారింది. అయితే మెంటర్‌గా కొనసాగడం కంటే కామెంటేటర్‌గా వ్యవహరించడమే తనకు అనుకూలంగా ఉంటుందని పీటర్సన్ తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.“ఐపీఎల్ 19వ సీజన్లో నేను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కొనసాగడం లేదు. మెంటర్‌గా పూర్తిస్థాయిలో పని చేయాలంటే అవసరమైన సమయాన్ని కేటాయించాలి. అది ఈసారి నాకు సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ కొత్త సీజన్లో జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను. మెంటర్‌గా లేకపోయినా కామెంటరీ బాక్స్‌లో మాత్రం నన్ను మీరు చూడొచ్చు. ప్రపంచంలోని టీ20 లీగ్‌లలో ఐపీఎల్ అత్యుత్తమం. త్వరలోనే మీ అందరినీ కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను” అని పీటర్సన్ తన పోస్టులో పేర్కొన్నాడు.గతంలో ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు మెంటర్‌గా ఢిల్లీ కోచింగ్ బృందంలో చేరిన పీటర్సన్, కేవలం ఏడాది కాలానికే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం విశేషం. ఇక ఐపీఎల్ 19వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ **Lucknow Super Giants**తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa