భువనగిరి జిల్లాలో గురువారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల కమిటీ జిల్లా కన్వీనర్ బుంగ సంజీవ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,937 మందికి 6, 526 మంది విద్యార్థులు హాజరుకాగా 411 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. జనరల్ విభాగంలో 5, 462 మందికి 5, 195 మంది హాజరు కాగా267 మంది గైర్హాజరయ్యరు. ఒకేషనల్ లో 1, 475 మందికి 1, 331 మంది హాజరుకాగా 144 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 94. 08శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు.