పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకణం నేటి నుండి ప్రారంభం కానుంది. మూల్యాంకణంకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ పూర్తి చేసింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ లో మూల్యాంకణం జరగనుంది. ఈ నెల 22వ తేదీ వరకు పది రోజుల పాటు సబ్జెక్టుల వారీ జవాబు పత్రాలను మూల్యాంకణం చేయనున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3. 60 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకణ చేయనున్నారు.
ఇందుకు గాను అవసరమైన ఉపాధ్యాయుల నియామకం చేపట్టారు. 137 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 274 మంది స్పెషల్ ఎగ్జామినర్లు, 823 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను నియమించారు. వీరు కాకుండా మరో పది మంది ప్రధానోపాధ్యాయులకు మూల్యాంకణ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మూల్యాంకణ విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేర సుల్తాన తెలిపారు.