మేషం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.
మిధునం: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కర్కాటకం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కన్య: వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.
తుల: దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
వృశ్చికం: ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
ధనస్సు: ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
మకరం: ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
కుంభం: అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
మీనం: ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.