మేషం: వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.
వృషభం: ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల, సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం: చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
సింహం: ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
కన్య: నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.
తుల: గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృశ్చికం; చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
ధనస్సు: మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.
మకరం: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.
కుంభం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
మీనం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.