చరిత్రలో తొలిసారిగా ఆదివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి 'వాట్సాప్' ద్వారా కేసు విచారణ చేపట్టారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ నాగర్‌కోయిల్ వెళ్లారు. తమ గ్రామం దైవ కోపానికి గురవుతుందని వరదరాజ స్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త పిఆర్ శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌న ఆయన విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఒకచోట, అడ్వకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం మరొక చోట ఉండగా కేసు విచారణ సాగింది.
ధర్మపురి జిల్లాలోని ఓ ఆలయానికి సంబంధించిన అంశమిది. ఆలయ ఠక్కర్, వంశపారంపర్య ధర్మకర్తను కార్ ఫెస్టివల్‌ను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం దేవాదాయ ఇన్‌స్పెక్టర్‌కు లేదని పేర్కొంటూ, న్యాయమూర్తి దానిని రద్దు చేశారు. నిషేధిత ఉత్తర్వులను కొట్టివేసిన న్యాయమూర్తి, ఆలయ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఊరేగింపు జరిగే ప్రాంతంలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ డిస్కమ్ TANGEDCO ఆదేశించింది. తంజావూరు సమీపంలో గత నెలలో ఊరేగింపు సందర్భంగా ఆలయ రథం హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు తగలడంతో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఇక వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రథయాత్రను నిలిపి వేయగా, ఆయన ఆదేశాలను కోర్టు కొట్టేసింది.