భారత్ లోని సాంకేతిక విద్యాసంస్థలన్నింటికీ కనిష్ఠ, గరిష్ఠ బోధన రుసుములను ఏఐసీటీఈ ఖరారు చేసింది. ఏఐసీటీఈ అనుబంధ గుర్తింపు ఉన్న ప్రైవేటు సాంకేతిక విద్యాసంస్థలకు బోధన రుసుములను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ ఫీజుల కమిటీ (ఎన్‌ఎఫ్‌సీ) సమర్పించిన నివేదికను విడుదల చేసింది. ఇంజినీరింగ్ కు కనిష్ఠంగా రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,800 ఫీజులను ఏఐసీటీఈ సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 2015లో ఫీజులను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతేడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. దీనిపై రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించి, సమీక్షించేందుకు మరో ఉప కమిటీని నియమించింది. ఇప్పుడు తుది నివేదికను ఏఐసీటీఈ విడుదల చేసింది.