మూడు నెలలకు పైగా...సుదీర్ఘ పోరాటం. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం సహా, కీలకమైన నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా... అజోవ్ స్తల్ ప్లాంటును మాత్రం అంత తేలిగ్గా దక్కించుకోలేకపోయింది. ఇందుకు కారణం అజోవ్ రెజిమెంట్ . అయితే అజోవ్ స్తల్ ప్రాంతంపై రష్యా పట్టు సాధించడంతో... ఇంతకాలం ప్రాణాలకు తెగించి పోరాడిన అజోవ్ రెజిమెంట్ దళాలు రష్యాకు లొంగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా "కొరకరాని కొయ్య"లా మారిన అజోవ్ రెజిమెంట్ పై రష్యా ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. దానిని ఉగ్రసంస్థలా అంతర్జాతీయ సమాజంలో నిలబెట్టేందుకు సిద్ధమైంది