కోసిగి మండల పరిధిలోని చిన్నభూంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మమ్మ దేవి ఆలయ ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గోపురం కలశ ప్రతిష్టాపన, అమ్మవారి పాదాలు, ముఖద్వారం ఏనుగు విగ్రహాల ప్రతిష్టాపన ఉంటుందన్నారు. గురువారం సాయంత్రం మేళతాళాలతో విగ్రహాలను ఊరేగించారు. మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్లొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa