విద్యార్థులు తమ సెంటర్లని ఒక్క రోజు ముందే చూసుకోవాలి. మొదటి పరీక్ష రోజు ఉదయం 8. 30లోపే వెళ్ళండి, మధ్యాహ్నం12. 45 లోపు బయటకు రావద్దని పేర్కొంటూ. మొబైల్స్, గ్యాజేట్స్ తీసుకెళ్లొద్దు. హాల్టికెట్ జిరాక్స్ ఇంటివద్ద ఉంచుకోండి. ఒరిజినల్ హాల్టికెట్ జిరాక్స్, పరీక్ష ప్యాడ్, పెన్నులు, పెన్సిలు, లాంగ్ స్కేల్, రబ్బరు ఉండాలి. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ పై పేరు, హాల్ టికెట్ నెంబర్, తేదీ, సబ్జెక్ట్, చూసుకోండి. ఓఎంఆర్ షీట్, ఆబ్జెక్టివ్ పేపర్, గ్రాఫ్, మ్యాప్ పై మెయిన్ పేపర్ నెం. రాయాలి. తదితర సూచనల్లో తూచా తప్పకుండా పరీక్షలు రాయాలని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.