నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమైంది. యూనివర్సిటీల్లో 2, 774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఓయూ, జె ఎన్ టియూహెచ్ , కాకతీయ వంటి అన్ని రకాల వర్సిటీల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు.