ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియ ముగియడంతో ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఈ నెల 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ వారంలోనే ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు టెన్త్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.