తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజినీరింగ్ పోస్టులన్నింటినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ విభాగాలతో పాటు నీటి పారుదలశాఖ, ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూసీడీ తదితర విభాగాల్లోని ఇంజినీరింగ్ పోస్టులను కలిపి ఉమ్మడి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం.