యానాంలో పదో తరగతి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు రాయించడం కోసం పునశ్చరణ తరగతులు ప్రారంభించినట్లు విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణప్ర వీణ్ తెలిపారు. జులై ఆరు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నందున అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. తమ పిల్లలు బడులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కోరారు.