మహిమాన్విత నరసింహుని దివ్యక్షేత్రం శనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంగా విశ్వసిస్తున్నారు.