అవనిగడ్డలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ ఆవరణలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి. 20 మంది దంపతులు వ్రతాలలో పాల్గొనగా, ఆలయ ధర్మకర్తలు పోతరాజు బాస్కరరావు అన్నపూర్ణ దంపతులు ప్రతాలలో పాల్గొని వారికి ఉచితంగా పూజా సామాగ్రిని అందించారు. వైఖానసాగమ పండితులు దీవి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రతాలు నిర్వహించి కథను వినిపించగా, భక్తులు శ్రద్ధగా ఆలపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. ఆలయ ఈవో శీతారామయ్య ఏర్పాట్లు పర్యవేక్షించారు.