మేషం
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
వృషభం
నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు.
మిధునం
చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం
ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోనటం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
సింహం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి.ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్ధిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తుల
ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాదిస్తారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
వృశ్చికం
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
ధనస్సు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబమున కొందరి మాటల వలన మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.
మకరం
బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు పొందుతారు.
కుంభం
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం
చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.