మేషం
దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది.
వృషభం
సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.
మిధునం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.
కర్కాటకం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది.
సింహం
ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కన్య
ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.
తుల
చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
వృశ్చికం
వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.
ధనస్సు
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున బాగస్తులతో సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరం
అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కుంభం
మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి.
మీనం
దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.