ఇస్కాన్ నామహట్టా కూకట్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో బుదవారం జగన్నాధ రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్టు ఇస్కాన్ నామహట్టా కూకట్‌పల్లి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3: 00 గంటలకి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సింహద్వారం ( కమాన్) నుండి న్యూ గుండ్లపల్లి వరకు అక్కడ నుండి సాయంత్రం కు స్వామి వారి సింహద్వారం చేరుకుంటుందని తెలిపారు. యాత్ర భాగంగా ప్రసంగాలు కొనసాగుతాయని, వివిధ దేశాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.