దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్ళీ పెరిగాయి. నేటి నుంచి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో ఆ సిలిండర్ ధర రూ.1,053కి చేరింది.హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,105కు పెరిగింది. అలాగే, కోల్‌కతా, ముంబై, చెన్నైలో దాని ధరలు వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5 పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. వంట గ్యాస్ ధరలను చివరిసారిగా ఈ ఏడాది మే 19న సవరించిన విషయం తెలిసిందే.మరోవైపు, దేశంలో నేటి నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర యూనిట్‌కు రూ.8.5 చొప్పున తగ్గింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో దాని ధరలు వరుసగా వరుసగా రూ.2,012.50, రూ.2,132.00, రూ.1,972.50, రూ.2,177.50గా ఉన్నాయి. కాగా, ఒకవైపు, నిత్యావసర ధరలు పెరుగిపోతోన్న క్రమంలో మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కొన్ని నెలలుగా పెరిగిపోతుండడంతో ప్రజలపై మరింత భారం పడుతోంది.