తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ మొరవపల్లిలో వెలసిన శ్రీధనుమకొండ గంగమ్మ జాతర శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. గర్భాలయంలో అమ్మవారికి అభిషేకానంతరం సాయంత్రం పేరంట్రాల పూజ నిర్వహించారు. రాత్రి చెక్కభజన బృందం సభ్యుల నృత్యాలు , పాటలు అలరించాయి. ఆదివారం పాలేటి పూజ , గ్రామంలో అమ్మవారి ఊరేగింపు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa