తిరుపతి: వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో జయకుమార్ ( 35 ) నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాలవల్ల ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ జయ స్వాములు తెలిపారు.