టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. టెస్లా మోడల్ ఎక్స్, మోడల్ వై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌ను చేరుకున్నాయి. చెంగ్డు నుంచి 5 రోజుల పాటు 2,414 కి.మీ ప్రయాణించిన టెస్లా కార్లు.. సముద్ర మట్టానికి 17,060 అడుగుల ఎత్తైన ప్రదేశానికి చేరాయి. టెస్లా కార్ల సామర్థ్యాన్ని నిరూపించడానికి చైనాకు చెందిన ఓ టెస్లా కారు యజమాని ఈ ఫీట్ చేశాడు.