దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాల వ్యవధిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది.కొత్త SBI FD రేట్లు గత వారం నుంచి అమలులోకి వచ్చాయి. SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడం కారణంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త వడ్డీ రేట్లు జూలై 15 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఒకటి నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఖాతాల కోసం సాధారణ ప్రజలకు 4.75 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు SBI FDలపై అధనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంక్ ఇతర కాలపరిమితిపై రేట్లను స్థిరంగా ఉంచింది. సవరించిన వడ్డీ రేట్లు తాజా డిపాజిట్లకు, మెచూర్ అయ్యాక పునరుద్ధరించే డిపాజిట్లపై వర్తిస్తాయని SBI వెబ్‌సైట్ లో వెల్లడించింది. ముందుగా ఎఫ్ డీ ఉపసంహరించుకుంటే 1 శాతం పెనాల్టీ ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.