జీతాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ విమానాశ్రయ ఉద్యోగులు 4 గంటలు సమ్మెకు దిగడంతో ఇటలీ దేశంలో 500 విమాన సర్వీసులను రద్దు చేశారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎయిర్లైన్స్ ఉద్యోగులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వాకౌట్ చేశారు. ర్యాన్ఎయిర్, ఈజీజెట్, వోలోటియా ఎయిర్లైన్స్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారని ఇటాలియన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.