పలు విమానయాన సంస్థల్లోని విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో డీజీసీఏ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటికి రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. ఈ నెల 28 నుంచి అన్ని విమానయాన సంస్థలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.