మంకీపాక్స్ వ్యాధి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇటీవల భారత్ లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. సోమవారం కేరళలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని ఎయిర్ పోర్టులు, ఓడరేవుల అధికారులకు ఆదేశించింది. కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని సూచించింది.