మేషం
వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. రావలసిన బకాయిలు సకాలంలో అందవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.
వృషభం
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి.
మిధునం
వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం
నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు.
కన్య
స్ధిరాస్తి సంభందిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలు లోటు ఉండదు. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి.
తుల
ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం
వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.
ధనస్సు
జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు.
మకరం
సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మీనం
వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.