తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. మొత్తం 21 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం శ్రీవారిని 71,395 మంది భక్తులు దర్శించుకోగా 32,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.83 కోట్లు వచ్చిందని తెలిపారు.