అర్హులైన వారందరూ కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జ్యోతి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె నర్సీపట్నంలో విద్యార్థుల కోసం నిర్వహించిన బూస్టర్ డోస్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు డోసులు పూర్తి అయిన వారు బూస్టర్ డోస్ వేయించుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.