నర్సీపట్నం మున్సిపాలిటీలో శుక్రవారం డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గుదిబండ ఆదిలక్ష్మి మాట్లాడుతూ డెంగ్యూ నివారణ మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోమల నివారణకు ప్రజలు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలన్నారు. దామలను నిర్మూలించినప్పుడే డెంగ్యూ మలేరియా వ్యాధులను అరికట్టవచ్చున్నారు.