గూగుల్ మరో ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ యూజర్లు ఇకపై మీటింగ్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్‌లో చూడొచ్చు. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్‌కు మీటింగ్‌ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎక్కువ సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం ఉపయోగకరంగా ఉంటుందని, తద్వారా పాస్ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు రీప్లే చేసుకునే వీలు కల్పిస్తుందని వివరించింది.