విజయనగరం జిల్లా ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో జూలై 24న చీపురుపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రైడ్ నిర్వహించి, అక్రమంగా మద్యం బాటిళ్లు రవాణ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలియజేసారు. అరెస్ట్ చేసిన అతని వద్ద నుండి 118 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎటువంటి అక్రమ చర్యలకు పాల్పడిన చట్టం తీవ్రంగా శిక్షిస్తుంది కాబట్టి ప్రజలంధరు జాగర్తగా ఉండాలని హెచ్చరించారు అలానే జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవలసిన భాద్యత అందరి పైన ఉందని తెలియజేసారు.