ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.20 వేల లోపు ల‌భించే బెస్ట్​ స్మార్ట్​ ఫోన్లు ఇవే..!

Technology |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 04:18 PM

రూ.20 వేలలోపు ధరలో మనకు అనేక స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. వీటిలో బెస్ట్ ఫోన్‌ను సెలక్ట్‌ చేసుకోవడం అంత సులువు కాదు. ఇవన్నీ దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో కనిపిస్తాయి. అందుకే రూ.20 వేల లోపు కెమెరాలు, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి ఫీచర్‌లను కవర్ చేసే ఐదు బెస్ట్‌ ఫోన్‌ల గురించి తెలుసుకోండి..

* మోటో G52 (Moto G52)
మోటో G52 పెద్దవాళ్లకు బాగా సరిపోతుంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు, YouTubeలో కంటెంట్‌ను చూడటానికి డి-క్లటర్డ్ ఇంటర్‌ఫేస్, మంచి డిస్‌ప్లేను ఇష్టపడే వారికి ఇది సరిపోతుంది. మోటో G52 సూపర్-స్లీక్ బాడీని, పోలెడ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది AMOLED డిస్‌ప్లే కంటే మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. దీని ధర రూ.16,499గా ఉంది. బెస్ట్‌ డిస్‌ప్లే, కెమెరాలు, బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

* ఐక్యూ Z6 5G (iQoo Z6 5G)
ఐక్యూ Z6 5G స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్, యాప్ బ్రౌజింగ్‌కు బెస్ట్ ఆప్షన్. ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుంది. 4GB RAM వేరియంట్ ధర రూ.15,499 నుంచి ప్రారంభమవుతుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో రన్‌ అవుతుంది. ఈ ఫోన్‌లోని కెమెరాలు యావరేజ్‌గా ఉంటాయి. రోజువారీ ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్‌లకు ఇది సరిపోతుంది. గేమింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఓకే కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

* ఒప్పో K10 (Oppo K10)
ఒప్పో K10 అత్యంత సరసమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఇది బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. బ్యాటరీ లైఫ్‌ బాగుంటుంది. ప్రైమరీ, ఫ్రంట్‌ కెమెరాల ఫోటోలు కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి. తక్కువ రంగులతో ఉంటాయి. దీని బేస్ వేరియంట్ 6GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వస్తుంది. ధన సుమారు రూ.15,000గా ఉంది.

* వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 2 5G (OnePlus Nord CE 2 5G)
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 2 5G ఫోన్‌ ఈ రేంజ్‌లో లభిస్తున్న బెస్ట్‌ ఫోన్‌. కంపెనీ దీన్ని ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారు చేసింది. ఫోన్‌లో ఐకానిక్ స్లైడర్ బటన్ లేదు. ఈ ఫోన్‌ AMOLED స్క్రీన్‌కు బదులుగా LCD స్క్రీన్‌తో వస్తుంది. మెరుగైన రంగులు, కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. దీని కెమెరా క్వాలిటీ ఫర్వాలేదు. అయితే డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. దాదాపు 30 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.23,999. రిలయన్స్ డిజిటల్‌లో డివైజ్‌ను రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.

* రెడ్‌మీ నోట్‌ 11s (Redmi Note 11S)
రెడ్‌మీ నోట్‌ 11s స్మార్ట్‌ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను అందిస్తుంది. ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. చాలామంది కెమెరా-సెంట్రిక్ కస్టమర్లను ఆకర్షిస్తుంది. కానీ రాత్రి సమయంలో పనితీరు ఫ్లాట్‌గా ఉంటుంది . మొత్తంమీద రెడ్‌మీ నోట్‌ 11s బెస్ట్‌ ఫోన్‌. డిస్ప్లే ఎక్స్‌పీరియన్స్‌, కెమెరాల క్లారిటీ బాగుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com