కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. 2021 అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా, బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. మంత్రి కుమారుడు కాబట్టి కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆశిష్‌కు బెయిల్ నిరాకరించినట్లు కోర్టు తెలిపింది.