ఏపీ సీఎం జగన్ నేడు కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాడు. పి.గన్నవరం మండల పరిధిలో ఓ మహిళ తన చిన్నారిని ఎత్తుకొని వచ్చి సీఎం జగన్ కు వినవతిపత్రమిచ్చారు. మహిళ కొడుకును సీఎం జగన్ ఎత్తుకున్నాడు. ఆ తర్వాత మహిళకు ఇవ్వగా ఆ చిన్నారి జగన్ జేబులోని పెన్ను దిక్కు చూశాడు. దీంతో సీఎం జగన్ తన పెన్నును ఆ చిన్నారికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ పెన్ను ధర రూ.70 వేలకు పైగా ఉందని సమాచారం.