సిద్ధవటం మండలం భోగిడివారి పల్లె గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం 23న ప్రారంభించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి, జిల్లా పరిషత్ అమర్నాథరెడ్డి, కడప మేయర్ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు కే సురేష్ బాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని వారు కోరారు.