ఎల్గార్ పరిషద్ కేసులో బెయిల్పై ఇటీవల విడుదలైన విప్లవ రచయిత వరవరరావుపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆంక్షలు విధించారు. ముంబై విడిచి వెళ్లకూడదంటూ ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరవరరావును గ్రేటర్ ముంబై పరిధిలోనే నివసించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా నగరం దాటి వెళ్లకూడదని పేర్కొంది. అలాగే, సహ నిందితులతోగానీ, ఇలాంటి కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారితోగానీ సంప్రదింపులు జరపకూడదని తెలిపింది.