చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం దేవాలయ పున:ప్రతిష్ట కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు హాజరవుతారని వైసీపీ చెరుకుపల్లి మండల కన్వీనర్ దొంతుబోయిన వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. సత్య ప్రసూనాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయ పున:ప్రతిష్టకు ఎంపీ మోపిదేవి శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa