జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్ కోసం, ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత జట్టు 2 ప్రధాన మార్పులు చేసింది. కేఎల్ రాహుల్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణలకు విశ్రాంతినివ్వగా, దీపక్ చాహర్, అవేష్ ఖాన్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఈ సిరీస్‌లో రీతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అదే సమయంలో ఆసియా కప్‌లో జట్టులోకి ఎంపికైన అవేశ్ ఖాన్ కూడా తొలిసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.