ప్రధాని మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్తో, అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని ఆరోపించారు.