మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు అనంతపురం జిల్లా పోలీసులు ప్రారంభించిన " చాట్ బాట్ " సేవలకు విశిష్ట గుర్తింపు లభించింది. 2 వేల మొబైల్ ఫోన్లు రికవరీ మైలురాయిని దాటిన జిల్లా పోలీస్. " టెక్నాలజీ సభ - 2022" అవార్డుకు ఎంపిక. ఇది వరకు దాదాపు రూ. 3 కోట్ల విలువ చెసే 2083 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పిన జిల్లా పోలీస్.
ఈ విశిష్ట సేవలు అందించినందుకు "టెక్నాలజీ సభ - 2022"అవార్డును ఈనెల 25 నుండీ 27 వరకు కొలకత్తాలో జరుగనున్న కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కేరళ, బీహార్ , తదితర రాష్ట్రాలలో వాడుతున్న మొబైల్స్ ను సైతం రికవరీ చేసి అందిస్తున్న జిల్లా పోలీస్.