తెలుగువారి సాహసానికి ప్రతీక శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు. సమాజం కోసం తన కష్టార్జితాన్ని, జీవిత సర్వస్వాన్ని ధారపోసిన ప్రకాశం గారి వంటి త్యాగధనులు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు.
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి అవసరమైన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన కృషిచేశారు. ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహస పోరాటాన్ని స్మరించుకుంటూ...ఆయన స్మృతికి నివాళులు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.