పుణెలో ఓ వ్యక్తి డబ్బు కోసం క్షుద్రపూజలు చేశాడు. ఇందులో భాగంగా అతను భార్యను అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని కోరాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించారు. ఈ క్రమంలో భర్త ఒత్తిడికి తలొగ్గిన బాధితురాలు.. భర్త చెప్పినట్లు చేసింది. చుట్టూ ఉన్నవారు కూడా ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారే తప్ప, ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అనంతరం వారి బారి నుంచి బాధితురాలు తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.