పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనా కార్యక్రమంలో ప్రజల నుండి 85 ఫిర్యాదులు స్వీకరించి, సదరు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత డిఎస్పీలు భాద్యత వహించాలని ఆదేశించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. కుటుంబ కలహాల నేపథ్యం (వివాహితకు ఇది రెండవ వివాహం కాగా ఆమె భర్తకు ఇది నాలుగవ వివాహం) లో న్యాయం కోసం స్పందనా కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతుండగా పోలీస్ వారు నివారించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన శ్రీ ఎస్పీగారు సదరు వివాహిత భర్తపై గృహహింస చట్ట కింద కేసు నమోదు చేసి,చట్టపరంగా త్వరితగతిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట 2 టౌన్ సీఐ వెంకట్రావు గారిని ఆదేశించడం జరిగినది. ఈ విషయానికి సంబంధించి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వెలువడిన వార్తలు పూర్తిగా అవాస్తవం.మీడియా వారు సంయమనం పాటించాలని శ్రీ ఎస్పీగారు సూచించినారు.